
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. దీంతో కవితను ఈడీకార్యాలయానికి తరలించారు. విచారణ సమయంలో స్టేట్ మెంట్రికార్డ్ చేసేటప్పుడు కవిత అసంబద్ద సమాధానాలు ఇచ్చారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత తన వ్యవహారం అంతా రామచంద్రపిళ్లై ద్వారా నడిపినట్లు అందులో ఈడీ వెల్లడించింది. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ద్వారా కవిత ఢిల్లీకి రూ.30 కోట్లు తరలించారని పేర్కొంది. రూ.30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకువెళ్లినట్లు పేర్కొంది.సౌత్ లాబీ పేరుతో లిక్కర్ కేసులో ఆమె కీలకంగా వ్యవహరించారని అందులో పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవితనే కీలక సూత్రధారి అని తెలిపింది. కవితకు బినామీగా రామచంద్రపిళ్లై వ్యవహరించినట్లు పేర్కొంది
కవిత తన మొబైల్ ఫోన్లోని ఆధారాలను తొలగించినట్లు అందులో పేర్కొంది. సౌత్ గ్రూప్‌లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవలతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కవిత కుట్రలు పన్నినట్లు అందులో పేర్కొంది . ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అరుణ్ పిల్ళైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటాలను పొందినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇతరులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల లంచం ఇచ్చినట్లు తెలిపింది.